Vanama Raghavendra remand: వనమా రాఘవేంద్రకు కోర్టు రిమాండ్ పొడిగించింది. గతంలో విధించిన 14 రోజులు రిమాండ్ గడువు ముగియడంతో రాఘవను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్ మొదటిశ్రేణి కోర్టులో వర్చువల్‌గా హాజరుపర్చారు జైలు అధికారులు. కొవిడ్ ఆంక్షల వల్ల కోర్టు ఆన్‌లైన్‌లో విచారించింది. ఇప్పటికే విధించిన రిమాండ్ ముగియడంతో మరో 14 రోజులు పొడిందించింది. ఫిబ్రవరి 4 వరకు వనమా రాఘవ జైలులోనే ఉండనున్నారు.
ఈ నెల 3న భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ నాగ రామకృష్ణ.. అంతకుముందు తీసుకున్న సెల్ఫీవీడియోలో వనమా రాఘవపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అవమానం భరించలేక కుటుంబంతో సహా చనిపోతున్నట్లు రామకృష్ణ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటన బయటికి వచ్చినప్పటి నుంచి పరారీలో ఉన్న రాఘవ ఆచూకీ కోసం పోలీసులు... రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు.. మందలపల్లి అడ్డరోడ్డు వద్ద రాఘవను పోలీసులు పట్టుకున్నారు. గతేడాది వెంకటేశ్వరరావు ఆత్మహత్య కేసులో రాఘవకు నోటీసులు ఇవ్వటం సహా.. రాఘవపై గతంలో నమోదైన కేసులను పోలీసులు వెలికితీస్తున్నారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో వనమా రాఘవను పోలీసులు ఏ-2గా చేర్చారు.
సంచలనమైన సెల్ఫీ వీడియో..
నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో అతని సెల్ఫీ వీడియో సంచలనమైంది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.
"రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. ఏ భర్త కూడా వినకూడని మాటను రాఘవ అడిగాడు. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని కోరాడు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశాడు. నేను ఒక్కడినే వెళ్లిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్తున్నా. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు" - సెల్ఫీ వీడియోలో నాగ రామకృష్ణ ఆవేదన
ఇదీ చదవండి : వనమా రాఘవ రిమాండ్ రిపోర్టు.. 'మొత్తం 12కేసులు'
Vanama Raghava Land Kabza: భూ బకాసురుడు... బయటకొస్తున్న రాఘవ ఆగడాలు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!