సికింద్రాబాద్లోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. రాష్ట్రపతి భవన్ సమీపంలో ఓ గుర్తు తెలియని శవం రైలు పట్టాల పక్కన ఉండటాన్ని గమనించిన స్థానికులు.. బొల్లారం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం ఆధారాలు సేకరించారు.
మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో పోలీసులకు గుర్తించేందుకు కష్టతరంగా మారింది. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వ్యక్తి ఎవరు, ఎన్ని రోజుల క్రితం చనిపోయాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: కార్ల దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు