ETV Bharat / crime

fire to the hut : గుడిసెకు నిప్పు.. రోడ్డున పడ్డ కుటుంబం

fire to the hut : గుడిసెకు నిప్పు పెట్టి ఓ కుటుంబాన్ని అంతం చేయాలనుకున్నారు. వారు అనుకున్న విధంగా గుడిసె బయట తలుపుకు గడియపెట్టి నిప్పు అంటించారు. ఈ హఠాత్పరిణామంతో అందులోని నివసిస్తున్న కుటుంబం గందరగోళానికి గురయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.

The hut burned
గుడిసె దగ్ధం
author img

By

Published : Mar 19, 2022, 10:16 PM IST

fire to the hut : మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్​లో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి చిన్న సిద్ధయ్య తన భార్య సాయవ్వ, మనుమడు, మనుమరాలుతో ఇంట్లో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుడిసె దగ్గరకు వచ్చి తలుపుకు గడియపెట్టి నిప్పు పెట్టారు.

గుడిసె నుంచి పొగలు రావడంతో లోపల నిద్రిస్తున్న వారికి మేలకువ వచ్చి బయటకి వచ్చేందుకు ప్రయత్నించారు. బయట తలుపుకు గడియ ఉండడంతో పెద్దగా కేకలు వేశారు. పక్కింటి వారు వచ్చి తలుపు తీయడంతో సిద్ధయ్య కుటుంబం ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న రామాయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంకల్ప్ ఫౌండేషన్ చేయూత

కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు సిద్ధయ్య కుటుంబానికి సంకల్ప్ ఫౌండేషన్ చేయూత అందించారు. సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు బియ్యం, నిత్యావసర సరుకులు, ఐదు వేల రూపాయల నగదును అందజేశారు.

ఇదీ చదవండి: ఆటో అదుపుతప్పింది.. భవిష్యత్తుపై గుబులు మొదలైంది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.