రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మున్సిపాలిటీ పరిధిలోని బుద్వేల్‌లో ఇద్దరు వ్యక్తులపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి పారిపోయారు. బుద్వేల్‌లో పాన్‌షాప్ నడిపిస్తున్న అమానుల్లాతో పాటు అఫ్రోజ్‌పై నలుగురు దుండగులు దాడి చేయగా.. వారిద్దరు గాయపడ్డారు.
గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: హుస్సేన్‌సాగర్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం