ETV Bharat / crime

సర్కార్‌ దవాఖానాలో ఇద్దరు బాలింతలు మృతి.. స్పందించిన ఎమ్మెల్యే - హైదరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి

Two Women Died in Malakpet Govt Hospital : హైదరాబాద్‌ మలక్‌ పేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు బాలింతలు మృతి చెందారని ఆరపిస్తూ వారి కుటుంబీకులు, బంధువులు ఆందోళకు దిగారు. అత్యవసర వైద్యం కోసం వచ్చినవారిని సిబ్బంది సరిగా పట్టించుకోకపోవడం వల్లే రెండు నిండు ప్రాణాలు బలైపోయాయని నిరసన తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని నినదించారు.

Two Women Died in Malakpet Govt Hospital

author img

By

Published : Jan 13, 2023, 12:28 PM IST

Updated : Jan 13, 2023, 2:13 PM IST

Two Women Died in Malakpet Govt Hospital : హైదరాబాద్ మలక్‌ పేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందడం కలకలం రేపింది. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం వచ్చి ఇద్దరు బాలింతలు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు బాలింతల మృతితో నగరంలోని మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుల నిర్లక్ష్యంతోనే వారు చనిపోయారంటూ బాధితుల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.

వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన మహేశ్‌.. తన భార్య సిరివెన్నెల (23)తో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. మహేశ్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్యను ఇటీవల కాన్పు కోసం మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆపరేషన్ చేసి వైద్యులు కాన్పు చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అస్వస్థతకు గురికావడంతో వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిరివెన్నెల ప్రాణాలు కోల్పోయింది. మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందంటూ ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని చాదర్‌ఘాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్ద బైఠాయించారు.

బాధితుల ఆందోళన

మరోవైపు తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జగదీశ్‌.. తన భార్య శివాణిని ఈ నెల 9న మలక్‌పేట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో శివాని బాబుకు జన్మనిచ్చిన అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో మలక్‌పేట్‌ ఆస్పత్రి వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివాని కూడా ప్రాణాలు కోల్పోయింది.

ఇద్దరు బాలింతల మృతితో బాధిత కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ మలక్‌పేట ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. పేద కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఇద్దరు బాలింతలు మృతి చెందినా కనీసం వైద్యశాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమన్నారు.

పేదలైనందునే చిన్నచూపు చూస్తున్నారని బాధితుల కుటుంబ సభ్యులు నిరసించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలింతలు చనిపోయారని చాదర్‌ఘాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణం ఘటనపై డీఎంహెచ్‌ఓ, కలెక్టర్ స్పందించి విచారణ చేపట్టాలని కోరుతున్నారు. బాధ్యులైన వైద్యులపై వేటు వేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరోవైపు ఈ సంఘటనపై ఆస్పత్రి డీసీహెచ్ఎస్ సునీత స్పందించారు. బాలింతల మృతిలో వైద్యుల నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. ‘‘మృతుల్లో ఒకరైన సిరివెన్నెలను రెండో కాన్పు కోసం 9న ఆస్పత్రికి తీసుకొచ్చారు. 11న కాన్పు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అంతకుముందు చేసిన అన్ని పరీక్షల్లో ఎలాంటి లోపాలు కనిపించలేదు. 11న ఉదయం కాన్పు చేశారు. 12న సాయంత్రం 4 గంటలకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందంటూ సిరివెన్నెల వైద్యుల దృష్టికి తీసుకొచ్చారు. పరీక్షిస్తే గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు తేల్చారు. వెంటనే గుండె సంబంధిత వైద్యులను సంప్రదించాల్సిందిగా వైద్యులు సూచించడంతో వెంటనే గాంధీకి రెఫర్‌ చేశారు. గాంధీలో చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి సిరివెన్నెల ప్రాణాలు కోల్పోయారు. సరైన విచారణ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుంటాం."అని డీసీహెచ్‌ఎస్‌ వివరించారు.

‘‘మరో మృతురాలు శివాని డయేరియా సమస్యతో 10వ తేదీన మధ్యాహ్నం ఆస్పత్రికి తీసుకొచ్చారు. శివానికి హైపోథైరాయిడ్‌ సమస్య ఉంది. ఫిజిషియన్‌ను సంప్రదిస్తే.. ఇది హైరిస్క్‌ కేసు అని చెప్పారు. నొప్పులు వస్తున్నాయని చెప్పడంతో 11న మధ్యాహ్నం కాన్పు చేశారు. 12న రాత్రి మరోసారి అస్వస్థతకు గురైంది. కళ్లు తిరగడం, కనిపించకపోవడం, చెమట పట్టడం లాంటి ఇబ్బందులు ఉన్నట్లు శివాని వైద్యులకు చెప్పారు. సివిల్‌ సర్జన్‌ అభిప్రాయం తీసుకొని వెంటనే గాంధీకి తీసుకెళ్లారు. చికిత్స తీసుకుంటూ ఇవాళ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో శివాని మృతి చెందింది’’ - సునీత , డీసీహెచ్‌ఎస్‌

ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే బలాల, పోలీసులు స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుని బాధితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. "ఈ ఘటనపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. బాలింతల మృతి విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకువెళ్తాం. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం." అని స్థానిక ఎమ్మెల్యే బలాల హామీ ఇచ్చారు.

మరోవైపు ఈ ఘటనపై ఏసీపీ దేవేందర్ స్పందించారు. "ఇద్దరు మహిళలు ప్రసవం తర్వాత మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి పంపించారు. కానీ వాళ్లు అక్కడికి వెళ్లాక చికిత్స పొందుతూ చనిపోయారు. మలక్‌పేట్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళలు చనిపోయారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆ మహిళలకు పోస్టుమార్టం నిర్వహిస్తాం. ఆ తర్వాత వచ్చే నివేదికను బట్టి చర్యలు తీసుకుంటాం." అని ఏసీపీ దేవేందర్ తెలిపారు.

మలక్‌పేట్‌ ఆస్పత్రి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చనిపోయిన మహిళల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని బీఆర్ఎస్, టీడీపీ, బీఎస్సీ పార్టీల నేతలు భరోసానిచ్చారు.

Last Updated : Jan 13, 2023, 2:13 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.