కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన నల్లబోతుల చేవూరి అంజమ్మ అడ్డదారిలో సంపాదనకై దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకుంది. తనకు దగ్గరి బంధువైన జానకితో కలిసి రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని దొంగతనాలను పాల్పడేది. ఈ నెల 12న గద్వాలలోని రెవెన్యూ కాలనీకి చెందిన పద్మావతి అనే మహిళ బస్టాండ్‌లో బస్సు ఎక్కుతుండగా అంజమ్మ, జానకి పద్మావతి చేతిలోని బ్యాగులోంచి చాకచక్యంగా రూ.90 వేల నగదు, నాలుగు తులాల బంగారు ఆభరణాలు తీసుకొని పరారయ్యారు.
నిఘా నేత్రాల ఆధారంగా మహిళలను గుర్తించగా.. గురువారం నిందితులు గద్వాల బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అక్కడే ఉన్న ఉమెన్ సేఫ్టీ వింగ్, పోలీస్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై ఇప్పటికే ఖమ్మం, వనపర్తి, పెబ్బేరు పోలీసు స్టేషన్‌లలో 9 కేసులున్నాయని ఎస్సై తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి రూ.90 వేల నగదు, 4 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపర్చారు.
ఇదీ చూడండి: ప్రమాదంలో ఇద్దరు మృతి.. అటుగా వెళ్తోన్న ఎంపీ నామ చూసి..