హైదరాబాద్ నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వేరు వేరు కారణాలతో మంగళి పెద్ద భీమయ్య, కాంతన్న అనే ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళి పెద్ద భీమయ్య హైదర్‌గూడలో ఫుట్‌పాత్‌పై క్షౌరవృత్తి చేసుకునేవారు. లాక్డౌన్ వల్ల పనిలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఓ భవనం సెల్లార్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
నారాయణగూడ ఆబ్కారీ పోలీస్‌స్టేషన్ ముందున్న బస్‌స్టాండ్ ఎదుట కాంతన్న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆధార్ కార్డు ఆధారంగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వాడిగా గుర్తించిన పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. రెండు వేర్వేరు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు.. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి శవాగారానికి తరలించారు.
ఇదీ చూడండి: మూడేళ్ల బాలుడిపై కత్తి విసిరిన కానిస్టేబుల్.. కన్ను కోల్పోయిన బాలుడు!