రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన రాగుల రమేశ్, పొన్నం శేఖర్, పుర్మాని ప్రశాంత్‌లు ముగ్గురు స్నేహితులు. రమేశ్ తన సొంత ఊళ్లో ఇల్లు కొనుగోలు చేయడానికి స్నేహితుడు.. శేఖర్‌ను రూ.5 లక్షలు అప్పు అడిగాడు. ఏప్రిల్ 25న శేఖర్ రమేశ్‌కు డబ్బు ఇచ్చాడు. ఆ నగదును రమేశ్.. సిరిసిల్ల అంబికా నగర్‌లోని తన ఇంట్లో భద్రపరిచి బస్వాపూర్ వెళ్లాడు.
అప్పు ఇచ్చినట్లుగా ఇచ్చి డబ్బు కాజేయాలనే ఉద్దేశంతో శేఖర్.. తన స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి రమేశ్ ఇంట్లోని రూ.5లక్షలు దొంగతనం చేశారు. ఇద్దరు తమ వాటాలు పంచుకున్నారు. తన బీరువాలో పెట్టిన నగదు పోయిందని గ్రహించిన రమేశ్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. శేఖర్, ప్రశాంత్‌లే డబ్బు దోచినట్లు రుజువైంది. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.