నిజామాబాద్ జిల్లా భీంగల్ మార్కెట్లో కూరగాయల వ్యాన్ బీభత్సం సృష్టించింది. కూరగాయలు దింపిన తర్వాత డ్రైవింగ్ రాని బాలుడు వాహనాన్ని నడపడంతో ప్రమాదం చోటుచేసుకుంది. సాయంత్రం సమయంలో వేగంగా దూసుకెళ్లిన వ్యాన్... రెండు కార్లను తప్పించి ఇద్దరిని ఢీకొట్టి ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఓ బాలిక, మరో యువకుడు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగే సమయంలో స్థానికంగా ఉన్న పలువురు మహిళలు ప్రాణాలతో బయటపడ్డారు.
ఇదీ చదవండి: 'వివాహితపై అత్యాచారం... భర్త రాగానే పారిపోయాడు'