ETV Bharat / crime

కుమార్తెను కాపాడబోయి తండ్రి.. అతన్ని కాపాడబోయి యువకుడు మృతి - కొత్తూరు తండా వార్త

Two people drowned in water: కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనానికి వచ్చి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరు మృతి చెందిన ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. కుమార్తెను కాపాడబోయి తండ్రి నీటిలో మునిగిపోగా... అతని కాపాడబోయిన మరో యువకుడు నీటిలో మునిగి మృతి చెందారు.

Two people drowned in water
Two people drowned in water
author img

By

Published : Jan 29, 2023, 10:53 PM IST

Two people drowned in water in AP: అశ్వర్థనారాయణ స్వామి ఉత్సవాల కోసం ఆ కుటుంబమంతా బెంగళూరు నుంచి ఏపీలోని అనంతపురం జిల్లాకు వచ్చారు. అప్పటివరకు ఆడుతూ పాడుతూ గడిపిన ఆ అమ్మాయి నీటిలో పడిపోయింది. అది గమనించిన ఆమె తండ్రి కాపాడే ప్రయత్నం చేశాడు. చివరికి ఆ అమ్మాయిని ఒడ్డుకు చేర్చాడు. అనంతరం తాను ఒడ్డుకు రాలేక నీటిలో మునిగిపోతుండగా.. వారితో వచ్చిన ఓ యువకుడు అతడిని కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ యువకుడు సైతం నీటిలో మునిగిపోయాడు. నీటిలో మునిగిన విషయం తెలుసుకున్న స్థానికులతో పాటు.. పోలీసులు ఆ యువకుడిని కాపాడే ప్రయత్నం చేశారు. త్వరగా స్పందించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా చిన్నపప్పూరులోని అశ్వర్థనారాయణ స్వామి తిరునాళ్లలో విషాదం చోటు చేసుకుంది. ఆలయ సమీపంలోని పెన్నా నదిలో ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. మృతులు బెంగళూరులో సిమెంట్ డీలర్‌గా పని చేస్తున్న వెంకటనారాయణ... ఉత్సవాలకు కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనానికి వచ్చారు. అతనితో పాటు శ్రీనాథ్ అనే యువకుడు కూడా వచ్చాడు. తన కుమార్తె నీటిలో పడిపోతుండగా కాపాడిన అనంతరం... వెంకటనారాయణ నీటిలో మునిగిపోయారు.

వెంకటనారాయణ కోసం నదిలోకి దిగిన శ్రీనాథ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులకు కుటుంబసభ్యులు సమాచారమివ్వడంతో... వారిని వెలికి తీశారు. నదిలోనే వెంకటనారాయణ మృతి చెందగా... తాడిపత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... శ్రీనాథ్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఉత్సవాల కోసం వస్తే తమ ఇంట విషాదం నెలకొనడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడు వెంకటనారాయణకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

కత్తితో పొడిచి హత్య: నూజివీడు మండలం సిద్ధార్థ నగర్ కొత్తూరు తండా వద్ద దారుణం చోటు చేసుకుంది. బాణావతు హిల్లే అనే వ్యక్తిని గ్రామానికి చెందిన పోరియా అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనలో బాణావతు హిల్లే అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ తలారి రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.