రంగారెడ్డి జిల్లా మణికొండలో దారుణం జరిగింది. జ్వరం ట్యాబ్లెట్ ఇవ్వమని అడిగి... షాపు యజమానిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. జ్వరం ట్యాబ్లెట్ ఇస్తుండగా... మెడికల్ షాపులోకి చొరబడి యజమాని చెన్నారెడ్డిపై విచక్షణారహితంగా పిడిగుద్దుల వర్షం(Attack) కురిపించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చెన్నారెడ్డిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.
దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అకారణంగా తనపై దాడి చేశారంటూ నార్సింగి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. దాడి(Attack) చేసింది ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చారు..? ఘటనకు సంబంధించిన కారణాలపై పోలీసులు ఆరా ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: maoist killed in telangana: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి