జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం తుమ్మల గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక నుంచి తెచ్చిన మందును విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు చేశారు. లక్షా 30 వేల రూపాయల విలువైన మద్యం, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఈ బానోత్ పటేల్ తెలిపారు.
మహబూబ్నగర్ ఎన్ఫోర్స్మెంట్ బృందం, అలంపూర్ ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా ఈ దాడులు జరిపినట్లు వివరించారు. రాధాకృష్ణ, తిరుమలేష్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం వెతుకుతున్నారు. కర్ణాటక నుంచి మద్యం తీసుకువచ్చి విక్రయించడమే కాకుండా.. ఏపీకి తరలిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా