రెండు కిలోల బరువు గల బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్ మాయమైంది. జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సులో ముంబయి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా బ్యాగు మాయమైందని బంగారు ఆభరణాల వ్యాపారి శ్రవణ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తామడిగే ప్రశ్నలకు బాధితుడు శ్రవణ్‌కుమార్ పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని పోలీసులు పేర్కొంటున్నారు.
పోయిన బంగారు ఆభరణాల కొనుగోలుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని బాధితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు. అసలు బంగారు ఆభరణాల బ్యాగును ముంబయి నుంచి తీసుకువచ్చాడా లేదా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీచూడండి: murder: వృద్ధురాలు దారుణ హత్య... నగల కోసం కిరాతకం