Janwada Farmhouse Case : జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీసుల విచారణ ముగిసింది. మోకిలా పోలీసుల ఎదుట విజయ్ మద్దూరి(ఏ2) హాజరయ్యారు. కొన్ని రోజులుగా విచారణకు హాజరుకాని విజయ్ మద్దూరి ఈ రోజు(నవంబర్ 06)న పోలీసుల ఎదుట విచారణకు హాజరవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాలకు విజయ్ స్నేహితుడు. ప్రస్తుతం విజయ్ మద్దూరిని పోలీసులు ఈ వ్యవహారంలో విచారించారు. ఫామ్ హౌస్ పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరి సాంపిల్స్‌ను పరీక్షించగా ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.
పోలీసుల ప్రశ్నలు ఇవే : పార్టీలో మాదకద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు సరఫరా చేశారు? ఇప్పటివరకు ఎన్నిసార్లు మాదకద్రవ్యాలు తీసుకున్నారు? అనే కోణంలో పోలీసులు విజయ్ మద్దూరిని ప్రశ్నించినట్లు తెలిసింది. దాదాపుగా నాలుగు గంటల పాటు విజయ్ మద్దూరిని పోలీసులు విచారణ చేశారు. గతంలో రాజ్‌పాకాల ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన పలు సమాధానాల ఆధారంగా కూడా విజయ్ మద్దూరికి పోలీసులు పలు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది.
4 గంటల విచారణ అనంతరం మోకిల పోలీస్‌స్టేషన్ నుంచి విజయ్ మద్దూరి వెళ్లిపోయారు. రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లో జరిగిన లిక్కర్ పార్టీలో విజయ్ మద్దూరికి పరీక్ష నిర్వహించగా డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. జన్వాడ ఫామ్ హౌస్ లిక్కర్ పార్టీ కేసుతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర చర్చలకు దారితీసింది.
జన్వాడ ఫామ్ హౌస్ కేసు - 7గంటల పాటు రాజ్ పాకాల విచారణ
ప్రకంపనలు రేపుతోన్న ఫామ్ హౌస్ పార్టీ : పరారీలో రాజ్ పాకాల - పలువురు బీఆర్ఎస్ నేతలు అరెస్ట్