ETV Bharat / offbeat

స్ట్రీట్ స్టైల్ "వెజ్ మోమోస్" - ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! - టేస్ట్ సూపరంతే!

ఇంట్లోనే ఈజీగా ఇలా వెజ్ మోమోస్ ప్రిపేర్ చేసుకోండి - అందరూ ఎంతో ఇష్టంగా తినడం పక్కా!

Street Style Veg Momos
Veg Momos Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Street Style Veg Momos Recipe : ఇటీవల కాలంలో ఆహార ప్రియుల ఫేవరెట్​ ఫుడ్​గా​ మారిపోయిన రెసిపీలలో ఒకటి మోమోస్. ఇందులో రకరకాల వైరైటీలు ఉంటాయి. ఈ క్రమంలోనే బయటకు వెళ్లినప్పుడు కొందరు వెజ్ మోమోస్ టేస్ట్ చేస్తే, మరికొందరు మరో వైరైటీ రకం మోమోస్​ని తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే, బయట లభించేవి అంత ఆరోగ్యకరమైనవో.. కాదో.. తెలియదు కాబట్టి ఇంట్లోనే ఇలా ఈజీగా వెజ్ మోమోస్ ప్రిపేర్ చేసుకోండి. చాలా రుచికరంగా ఉండి అందరూ ఎంతో ఇష్టంగా తింటారు! మరి, ఆలస్యమెందుకు ఇందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • మైదా - 400గ్రాములు
  • మెత్తగా దంచిన ఓట్స్‌ పొడి
  • బేకింగ్‌ సోడా- పావుచెంచా
  • నూనె- తగినంత
  • వాటర్ - తగినన్ని

స్టఫింగ్ కోసం :

  • అరకప్పు - మొక్కజొన్న గింజలు
  • పావుకప్పు - సన్నగా తరిగిన క్యారెట్‌ ముక్కలు
  • అరకప్పు - క్యాప్సికమ్‌ ముక్కలు
  • పావుకప్పు - సన్నని క్యాబేజీ తరుగు
  • రెండు చెంచాలు - వెల్లుల్లి తరుగు
  • పావుకప్పు - పచ్చిబఠాణీలు
  • కొద్దిగా - ఉల్లిపాయ తరుగు
  • రెండు చెంచాలు - నూనె
  • రుచికి తగినంత - ఉప్పు
  • పావుచెంచా - మిరియాల పొడి
  • కొద్దిగా - సోయాసాస్‌, నిమ్మరసం
  • అరచెంచా - మ్యాగీ మసాలా
  • కొద్దిగా - కొత్తమీర తరుగు

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్​లో మైదా, ఓట్స్‌పొడి, బేకింగ్‌ సోడాలని తీసుకుని తగినంత ఉప్పు వేసి నీళ్లు కలుపుకొంటూ చపాతీపిండిలా కలుపుకోవాలి. ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక దానిపై ఒక తడి బట్టను ఉంచి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు రెసిపీలోకి కావాల్సిన స్టఫింగ్​ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత పైన పేర్కొన్న మిగిలిన కాయగూరలు కూడా వేసి వేయించుకోవాలి. అవి కూడా వేగాక ఆ మిశ్రమంలో మ్యాగీ మసాలా, మిరియాల పొడి, ఉప్పు, సోయాసాస్‌ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కాసేపు వేయించుకోవాలి.
  • ఇక చివరగా కొత్తిమీర తరుగు వేసి, నిమ్మరసం పిండి మరోసారి మిశ్రమాన్ని కలిపి దింపుకోవాలి. రెసిపీలోకి కావాల్సిన స్టఫింగ్ రెడీ!
  • ఇక ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదాపిండిని మరోసారి కలుపుకొని తర్వాత కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్నచిన్న చపాతీల్లా ఒత్తుకోవాలి.
  • ఆవిధంగా చిన్నచిన్న చపాతీలను ప్రిపేర్ చేసుకున్నాక వాటిల్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్​ని చపాతీకి సరిపడా పెట్టుకొని చిన్న మూటల్లా తయారు చేసుకోవాలి.
  • అనంతరం స్టౌపై ఇడ్లీ పాత్రను పెట్టుకొని అందులో మీరు ప్రిపేర్ చేసుకున్న వాటిని ఉంచి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఐదు నుంచి పదినిమిషాల్లో ఇవి చక్కగా ఉడికిపోతాయి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక వాటిని బయటకు తీసి ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా స్ట్రీట్ స్టైల్ "వెజ్ మోమోస్" రెడీ!

ఇవీ చదవండి :

ఈవెనింగ్​ టైమ్​ బెస్ట్​​ స్నాక్ "ఎగ్​ 65" - ఎటువంటి సాస్​లు అవసరం లేదు - టేస్ట్​ సూపర్​!

బండి మీద అమ్మే "ముంత మసాలా" - చిటికెలో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.