US Elections Indian Americans : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన అభ్యర్థుల హవా మరోసారి కొనసాగింది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో పోటీ చేసిన తొమ్మిది మంది భారతీయ అమెరికన్లలో ఆరుగురు అభ్యర్థులు విజయం సాధించారు. అందులో ఐదుగురు తమ స్థానాల నుంచే పోటీ చేసి మరోసారి గెలుపొందారు.
- వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి భారత సంతతికి చెందిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి సుహాస్ సుబ్రహ్మణ్యం విజయం సాధించారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో టెక్ పాలసీ అడ్వైజర్‌గా సుబ్రహ్మణ్యం పనిచేశారు. 2020లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
CONGRATULATIONS @SuhasforVA!
— Jennifer Wexton (@JenniferWexton) November 6, 2024
I couldn’t be prouder to call Suhas my next Congressman, and to have him carry on my legacy fighting for the families of #VA10.
Suhas is going to be an outstanding leader who will bring our community together. pic.twitter.com/NBu4DdXw1R
- ఇల్లినోయీ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి రాజా కృష్ణమూర్తి డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి మార్క్ రిక్‌ను దాదాపు 30వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. 2016లో తొలిసారి ఆయన అక్కడి నుంచి ప్రతినిధుల సభకు వెళ్లారు. సెలక్ట్ కమిటీ ఆన్ చైనీస్ కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా పనిచేశారు.
It was an honor to present Vietnam War-era veterans with pins commemorating their service this week in St. Charles in recognition of the upcoming 50-year anniversary of the end of the conflict. The debt of gratitude we owe these heroes is greater than we can ever repay. pic.twitter.com/G8WxSpIsY0
— Congressman Raja Krishnamoorthi (@CongressmanRaja) November 1, 2024
- కాలిఫోర్నియాలోని 6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డాక్టర్ అమిబెరా మరోసారి బరిలో విజయం సాధించారు. 59 ఏళ్ల అమి 2013 నుంచి ఈ స్థానంలో విజయం సాధిస్తున్నారు.
- కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీలో దిగిన రో ఖన్నా కూడా విజయం సాధించారు. ఆయన గత కొన్నేళ్ల నుంచి గెలుస్తూ వస్తున్నారు.
- మిషిగాన్‌లోని 13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి శ్రీ తానేదార్ మరోసారి ఎన్నికయ్యారు.
- అరిజోనా స్టేట్ అసెంబ్లీలో వరుసగా 2018, 20, 22ల్లో విజయం సాధించిన డాక్టర్ అమిష్ షా ఇప్పుడు మరోసారి విజయం సాధించారు.
అమెరికా కాంగ్రెస్‌కు తొలి ట్రాన్స్‌జెండర్
మరోవైపు, డెలవేర్‌లోని ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి డెమొక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన సారా మెక్‌బ్రైడ్ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి జాన్ వేలెన్ 3తో, సారా మెక్‌బ్రైడ్ పోటీపడ్డారు.
Thank you, Delaware! Because of your votes and your values, I am proud to be your next member of Congress.
— Sen. Sarah McBride (@SarahEMcBride) November 6, 2024
Delaware has sent the message loud and clear that we must be a country that protects reproductive freedom, that guarantees paid leave and affordable child care for all our… pic.twitter.com/QgwRkpUlbD
సారా మెక్ బ్రైడ్ ఎల్‌జీబీటీక్యూ జాతీయ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో దాదాపు 3 మిలియన్లకుపైగా ప్రచార విరాళాలు సేకరించారు. 2016లో డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో ఒక ప్రధాన పార్టీ నిర్వహించిన సమావేశంలో ప్రసంగించిన మొదటి ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2020లో డెలవేర్‌లో తొలి ట్రాన్స్ స్టేట్ సెనెటర్‌గా వ్యవహరించారు. 2010 నుంచి డెలవేరియన్ ఓటర్లు డెమొక్రట్‌లకే మద్దతిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో సారా మైక్‌బ్రైడ్ విజయం సాధించారు.