ETV Bharat / crime

రోడ్డు ప్రమాదంలో అన్న మృతి.. చూసేందుకు వెళ్తున్న తమ్ముడు కూడా! - విజయవాడలో రోడ్డు ప్రమాదం

Gopalapuram accident: పనిమీద బయటకు వెళ్లిన వ్యక్తిని లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు పొట్టన పెట్టుకుంది. అయినప్పటికీ దాని దాహం తీరలేదు... అన్న మరణ వార్త తెలిసి... ఆగమేఘాలపై బయలుదేరి వస్తున్న సోదరుడిని దారికాచి... కారు రూపంలో ఎదురై ప్రాణాలు తీసుకుంది. గంటల సమయంలో అన్నదమ్ములను రోడ్డు ప్రమాదాల రూపంలో బలిగొంది. ఇద్దరు బిడ్డల మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషాద ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో జరిగింది.

gopalapuram accident
gopalapuram accident
author img

By

Published : Jan 8, 2022, 3:28 PM IST

Gopalapuram accident : రోడ్డు ప్రమాదంలో చనిపోయిన అన్న మృతదేహాన్ని చూసేందుకు వెళ్తున్న.. తమ్ముడు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషాద ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది...

ఏపీలోని కృష్ణాజిల్లా ఎ.కొండూరు మండలం గోపాలపురం వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. లారీ ఢీకొనడంతో గొల్లమందలకు చెందిన తేళ్లూరి బాబు...... ఘటనా స్థలంలోనే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలుకున్న మృతుడి సోదరుడు తేళ్లూరి రామారావు...అన్న మృతదేహాన్నిచూసేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. జీల్లకుంట సమీపంలో.... ఇతను ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో రామారావు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని తిరువూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కొన్ని గంటల వ్యవధిలోనే వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో అన్నదమ్ములు చనిపోవడం విషాదం నింపింది.

ఇదీ చూడండి: Man Killed Girlfriend in Karimnagar : పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.