ETV Bharat / crime

విశాఖ: నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఇద్దరు మృతి - ఏపీ తాజా వార్తలు

accident
ప్రమాదం
author img

By

Published : Jul 6, 2021, 6:44 PM IST

Updated : Jul 6, 2021, 7:39 PM IST

18:42 July 06

విశాఖ: నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఇద్దరు మృతి

ఏపీలోని విశాఖ జిల్లా అనకాపల్లి వై జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన సైడ్‌ పిల్లర్‌ కూలి రహదారిపై వెళ్తున్న వాహనాలపై పడింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఓ కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ట్యాంకర్​ వాహనంలో ఉన్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

బ్రిడ్జి పిల్లర్లు పెద్ద శబ్దంతో కూలడంతో జనం పరుగులు తీశారు. కూలిన బ్రిడ్జి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బ్రిడ్జి కింద ఇంకెవరైనా చిక్కుకున్నారేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అనకాపల్లి వై జంక్షన్‌ వద్ద వంతెన నిర్మాణం చేపట్టారు. 

వంతెన సైడ్‌ పిల్లర్‌ ఒక్కసారిగా కూలిపోవడంతో వంతెన నిర్మాణంలో నాణ్యతపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం సంభవించడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ కు అంతరాయం ఏర్పడింది. నిర్మాణంలో లోపాలే ఈ ప్రమాదానికి కారణమా అన్నది తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: బిహార్​ను ముంచెత్తిన వరదలు- ప్రజల అవస్థలు

Last Updated : Jul 6, 2021, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.