వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తోన్న ఓ టాటా ఏస్ వాహనం కంటైనర్లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఏపీలోని అనంతపురం జిల్లా పామిడి మండలం రామగిరి ఎగువ తండాకు చెందిన చెందిన గోపాల్ నాయక్ (35), పాళ్యం తండాకు చెందిన వెంకటేశ్వర్ నాయక్ (31)లు ఉరవకొండ మండలం లత్తవరం గ్రామానికి చెందిన హరికృష్ణ నాయక్ టాటా ఏస్ వాహనంలో కాయగూరలను హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఆ క్రమంలో వనపర్తి జిల్లా కొత్తకోట బై పాస్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం కంటైనర్ లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గోపాల్ నాయక్ మృతి చెందగా.. హరికృష్ణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగశేఖర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: పొగడ్తలతో సరిపెట్టేస్తున్నారు.. నిధులివ్వడం లేదు