TWO GIRLS FELL INTO A CANAL: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం శివారు దుబ్బ తండాలో విషాదం చోటుచేసుకుంది. తండా సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు.
అసలే జరిగిదంటే
ఎస్సారెస్పీ కాలువపై కట్టి ఉన్న తాడును పట్టుకొని నలుగురు బాలికలు ఆడుకుంటున్నారు. కానీ ప్రమాదవశాత్తు ఇద్దరు బాలికలు కాలువలో పడి పోయారు. మిగతా ఇద్దరు బాలికల అరుపులు విని తండా వాసులు కాలువలలో గాలించగా రమ్యశ్రీ(8) మృతదేహం లభించింది.
కొన ఊపిరితో ఉన్న వాసంతి(12) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. బంధుమిత్రుల రోదనలతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Two died in Gaddenna project: భైంసాలో విషాదం.. సరదాగా వెళ్లి మృత్యుఒడికి..