పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లాలోని మానేరు వాగులో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు శుక్రవారం రాత్రి మృత్యువాత చెందారు. కరీంనగర్‌కు చెందిన కొత్తపల్లి రామ్ చరణ్(09) శుక్రవారం ఉదయం ఓ కార్యక్రమం నిమిత్తం కుటుంబ సభ్యులతో నీరుకుల్లాకు వెళ్లాడు.
కార్యక్రమం అనంతరం అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు కొత్తపల్లి అనిల్(13)తో కలిసి.. మానేరు వాగులో ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగారు. వారిద్దరూ వాగుకు వెళ్లిన విషయం అక్కడ ఉన్న బంధువులకు తెలియలేదు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. వాగు ఒడ్డున వారి దుస్తులు కనిపించాయి. దీంతో గ్రామస్థులు, పోలీసుల సహాయంతో వాగులో మృత దేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం వారిని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : పల్టీ కొట్టిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి