నవరాత్రులు భక్తుల పూజలు అందుకున్న మహాగణపతి ఎట్టకేలకు గంగమ్మ ఒడి(Assault in Ganesh immersion 2021)కి చేరుకున్నాడు. మేళతాళాలు, డీజే పాటలు, డప్పుచప్పుళ్ల మధ్య ఊరూరా వీధుల్లో ఊరేగిస్తూ గణేశుణ్ని నిమజ్జనం(Assault in Ganesh immersion 2021) చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మహాగణపతి శోభాయాత్ర(Assault in Ganesh immersion 2021)లో.. పలు చోట్ల స్వల్ప గొడవలు చోటుచేసుకున్నాయి.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాం గ్రామంలో ఆదివారం రోజు నిర్వహించిన వినాయక శోభాయాత్ర(Assault in Ganesh immersion 2021)లో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. చిన్నగా మొదలైన వాగ్వాదం.. ఇరు కుటుంబాలు ఒకరిపైఒకరు కత్తులతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘర్షణలో గుర్రం శ్రీకాంత్ రెడ్డి, చిన్నారెడ్డి అనే యువకులతోపాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మిగతా ముగ్గురు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణకు శోభాయాత్ర(Assault in Ganesh immersion 2021)లో జరిగిన గొడవలే కారణమా లేక పాత కక్షల వల్ల దాడికి పాల్పడ్డారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.