వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామ శివారులో రోడ్డుప్రమాదం సంభవించింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతులు పరకాల మండలం లక్ష్మీపురానికి చెందిన గురిజపల్లి సత్యం రావు, నడికుడ మండలం ధర్మారం గ్రామానికి చెందిన దానబోయిన వీరస్వామిలుగా గుర్తించారు. క్షతగాత్రుడు బొజ్జం ఆనంద్ అని తెలిపారు.
సమాచారం అందుకున్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం వరంగల్‌కు తరలించారు. మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు.