వరంగల్ గ్రామీణ జిల్లా కట్య్రాల గ్రామ శివారులో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. కంటెపాలెం గ్రామానికి చెందిన సారయ్య.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... మరో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదానికి అతివేగం కారణమని తెలిపిన పోలీసులు.. ఒక్కరు కూడా హెల్మెట్ ధరించలేదని పేర్కొన్నారు. మృతి చెందిన సారయ్య తలకు తీవ్రగాయం కావడం వల్ల మరణించినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: పులి పంజా బాధిత కుటుంబ మౌన వేదన