ETV Bharat / crime

ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరి అరెస్ట్​

జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరిని నల్లకుంట​ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6బైక్​లను స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Jan 25, 2021, 6:15 PM IST

Two arrested for stealing two-wheelers in nallakunta
ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరి అరెస్ట్​

నల్లకుంట పోలీస్​స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి 6 బైక్​లను స్వాధీనం చేసుకొని.. వారిని కోర్టులో హాజరు పరిచినట్లు ఈస్ట్​జోన్ అడిషనల్ డీసీపీ మురళీధర్ తెలిపారు.

చార్మినార్​కు చెందిన సోహెల్ అలీ, మౌలాలికి చెందిన సయ్యద్ తాడెప్ మిత్రులిద్దరు గుట్కా, గంజాయి లాంటి వ్యసనాలకు అలవాటుపడ్డారు. జల్సాలకోసం డబ్బులు సరిపోక రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలే లక్ష్యంగా చేసుకొని ఈ చోరీలకు పాల్పడేవారు.

నల్లకుంట పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. పత్రాలు లేకపోవడంతో నిందితులను ఆరా తీశారు. విచారణలో బైక్​ను చోరీ చేసినట్లుగా వారు ఒప్పుకున్నారు. కొట్టేసిన మరో 5వాహనాలను నిందితుల ఇంటి వద్ద నుంచి రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితులు నల్లకుంట పరిధిలోని ఓ పాన్ షాప్​లో సైతం దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మీర్​చౌక్ పరిధిలో వాహనాల చోరీ కేసుకు సంబంధించి వారిద్దరూ గతంలో జైలుకి కూడా వెళ్లి వచ్చినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: మద్యం దుకాణంలో రూ.15 లక్షల నగదు చోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.