జోగులాంబ గద్వాల జిల్లా జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కాచిగూడకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు... 32 మంది ప్రయాణికులతో రాత్రి 11 గంటలకు ఏపీలోని కర్నూలు నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. ఉండవల్లి మండలం కంచుపాడు సమీపంలో డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 32 మంది ఉండగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
బస్సు బలంగా డివైడర్ను ఢీకొట్టడం వల్ల బస్సు రాడ్డు విరిగి వెనక వస్తున్న కారులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో కారులో వెంటనే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవటం వల్ల.. అందులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ హాని జరగకవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హైవే సిబ్బంది... రహదారిపై రాకపోకలను పునరుద్ధరించారు. మిగిలిన ప్రయాణికులను వేరువేరు వాహనాల్లో వారి వారి గమ్యస్థానాలకు పంపించారు.
ఇదీ చూడండి:
CM KCR: ప్రభుత్వ ఉద్యోగులకూ దళితబంధు.. కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్