కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బీర్కూర్ శివారులోని చౌడమ్మకయ్యలో నదిలో మునిగి నలుగురు మృతి చెందారు. దర్గా దర్శనం కోసం తెల్లవారుజామున నలుగురు బీర్కూర్ నుంచి బిచ్కుంద మండలం షెట్లూర్కు వెళ్లేందుకు మంజీరా నది వద్దకు వచ్చారు.
నలుగురు నది దాటుతుండగా మునిగిపోయారు. మృతులు అంజవ్వ, సోని, గంగోత్రి, ప్రశాంత్‌గా పోలీసులు గుర్తించారు. నలుగురు మృతదేహాలు స్థానికులు వెలికితీశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల పట్ల శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: డెల్టా భయంతో ఆ దేశాల్లో మళ్లీ ఆంక్షలు!