హైటెన్షన్ కేబుల్ పోల్‌ను టిప్పర్ ఢీ కొట్టిన ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు కోటి రూపాయలు నష్టం వాటిల్లిందని ట్రాన్స్‌కో ఎస్ఈ జగత్ రెడ్డి తెలిపారు. వారం రోజుల్లో కొత్త టవర్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. వాహన డ్రైవర్, యాజమానిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
విద్యుత్ తీగ తెగిపడినప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు దాదాపు అరవై విద్యుత్ మీటర్లు కాలి పోయినట్లు అధికారులు తెలిపారు. డిపార్ట్మెంట్ తరుఫున వాటి స్థానంలో కొత్త మీటర్లను ఏర్పాటు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: బిట్టు శ్రీనుకు 14 రోజుల రిమాండ్