ETV Bharat / crime

'నాన్నా.. నేనూ నీతో వస్తానంటూ వెళ్లి'.. చివరకు - కామారెడ్డిలో ట్రాక్టర్ పై నుంచి వెళ్లడంతో బాలుడు మృతి

Boy Was Killed in Kamareddy
Boy Was Killed in Kamareddy
author img

By

Published : Apr 9, 2022, 9:24 AM IST

Updated : Apr 9, 2022, 10:12 AM IST

09:21 April 09

కామారెడ్డి జిల్లాలో ట్రాక్టర్‌ పై నుంచి వెళ్లడంతో మూడేళ్ల బాలుడు మృతి

Boy Was Killed in Kamareddy : ఉదయాన్నే లేచిన ఆ రైతు తన పనులు ముగించుకుని త్వరగా పొలానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఇంతలో తన మూడేళ్ల కొడుకు కూడా నిద్ర లేచాడు. 'ఇంత పొద్దున్నే నిద్రలేచావేంటి నాన్నా' అంటే.. 'మళ్లీ నువ్వు ఎప్పుడు కనిపిస్తావో నాన్న' అంటూ ముద్దుముద్దు మాటలతో.. బుజ్జిబుజ్జి అడుగులతో నాన్న కౌగిట్లో చేరాడు. 'సరే కన్నా.. అమ్మ దగ్గరికి వెళ్లు ముఖం కడుగుతుంది. ఆ తర్వాత నువ్వు పాలు తాగు.. మనం కాసేపు ఆడుకుందాం' అని కొడుకుని బుజ్జగించాడు ఆ తండ్రి. ఆ బుడ్డోడు తన తల్లి వద్దకు వెళ్లగానే.. ఆ తండ్రి అతడికి తెలియకుండా మెల్లగా బయటకు వెళ్లాడు. వరి కోతలు ప్రారంభమవ్వడంతో వడ్లు తరలించేందుకు పొలానికి ట్రాక్టర్‌ తీసుకెళ్లాలని చెట్టు కింద ఉన్న ట్రాక్టర్ తీస్తున్నాడు.

ఇంతలో ముఖం కడుక్కుని వచ్చిన ఆ బాలుడికి తండ్రి కనిపించలేదు. 'నాన్న ఎక్కడికి వెళ్లాడమ్మా' అని తల్లిని అడిగితే 'ఆ చెట్టు కింద ఉన్నాడు కన్నా' అని చెప్పగానే.. వెంటనే అక్కడికి పరుగులు తీశాడు. అక్కడ ట్రాక్టర్ రివర్స్ తీస్తున్న తండ్రిని చూసి.. 'నాన్నా.. నాన్నా.. నేనూ వస్తాను నీతో' అంటూ అటువైపు వెళ్లాడు. కానీ చిన్నారి మాటలు ఆ తండ్రికి వినపడలేదు. వెనక ఆ పసివాడు ఉన్నాడని తెలియని ఆ తండ్రి ట్రాక్టర్ రివర్స్ తీస్తుండగా.. అది అతడిపై నుంచి వెళ్లింది. ఒక్కసారిగా బాలుడి కేక విన్న అతడికి గుండె ఆగినంత పనైంది. ఏమైందోనని ట్రాక్టర్ దిగి వచ్చి చూసిన ఆ రైతు గుండె ఈసారి నిజంగానే ఆగినట్లైంది. ఇప్పటివరకు తన గుండెలపై ఆడుకున్న ఆ పసిప్రాణాన్ని రక్తపు మడుగుల్లో చూసిన ఆ రైతుకు కాళ్ల కింద భూమి కంపించినట్లైంది. వెంటనే తేరుకుని ఆస్పత్రికి తీసుకెళ్దామని అనుకునేలోగానే ఆ బుడ్డోడు తనను వదిలి వెళ్లిపోయాడని గ్రహించాడు. చేజేతుల తన కొడుకును చంపేసుకున్నానని ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. ఇదంతా చూసిన ఆ కన్నతల్లి అక్కడే కుప్పకూలింది.

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కోమట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌పై నుంచి వెళ్లడంతో మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే మరణించాడు. చెట్టు కింద ఉన్న ట్రాక్టర్ తీస్తుండగా అక్కడికి వెళ్లిన బాలుణ్ని తండ్రి గమనించలేదు. రివర్స్ తీసే క్రమంలో ట్రాక్టర్ ఆ బాలుడిపై నుంచి వెళ్లి అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. గమనించిన తండ్రి ఆ పసివాడి దగ్గరికి వెళ్లి చూడగా అప్పటికే మరణించినట్లు గ్రహించాడు. తమ గారాలపట్టి కళ్లముందే రక్తపు మడుగులో పడి ఉండటం చూసిన ఆ కన్నవాళ్లు గుండెలవిసేలా రోదించారు. వారిని చూసి చుట్టుపక్కల వాళ్లు కంటతడి పెట్టుకున్నారు.

Last Updated : Apr 9, 2022, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.