సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పొట్ట కరుణాకర్, పవిత్రల కుమారుడు మూడేళ్ల రాహుల్ సోమవారం సాయంత్రం ఆడుకుంటూ పొరపాటున.. పొయ్యిపై కాగుతున్న వేడి నీటి గిన్నెకు తగిలాడు. వేడి నీళ్లు మీద పడటంతో చిన్నారికి గాయాలయ్యాయి. వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.
ఇదీ చదవండి: జవహర్‌నగర్‌లో మైనర్ బాలిక అదృశ్యం...