ETV Bharat / crime

Hashish Oil sales Gang Arrest: హాషీష్​ ఆయిల్​ ముఠా గుట్టు రట్టు.. ముగ్గురు అరెస్ట్​ - తెలంగాణ నేర వార్తలు

Hashish Oil sales Gang Arrest: మత్తు పదార్థాలు, హషీష్‌ ఆయిల్‌ విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి అయిదు లీటర్ల హషీష్‌ ఆయిల్‌, మూడు ఫోన్లు, 3 వేల రూపాయల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.

Hashish Oil sales Gang Arrest
Hashish Oil sales Gang Arrest
author img

By

Published : Dec 22, 2021, 3:15 PM IST

Hashish Oil sales Gang Arrest : హైదరాబాద్​లో హాషీష్​ ఆయిల్​ విక్రయిస్తున్న ముఠా గుట్టును రాచకొండ ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన మహ్మద్‌ అఫ్‌రోజ్‌, ముజీబ్‌ పాషా, ఉపేందర్‌రావు, వెంకటేశ్​ ముఠాగా ఏర్పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి హషీష్‌ ఆయిల్‌ను తీసుకొచ్చి హైదరాబాద్​లో విక్రయిస్తున్నారు.

లీటర్‌ హాషీష్​ ఆయిల్​ సుమారు రూ.3 నుంచి 5లక్షలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో నిషేధిత ఆయిల్‌ను సరఫరా చేసేందుకు యత్నిస్తుండగా... హయత్‌నగర్‌ ప్రాంతంలో పోలీసుల తనిఖీల్లో ముఠా పట్టుబడింది. ముఠాలోని మరో నిందితుడు వెంకటేశ్​ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నామని తెలిపారు. వారి నుంచి అయిదు లీటర్ల హషీష్‌ ఆయిల్‌, మూడు ఫోన్లు, 3 వేల రూపాయల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: అమెజాన్​లో మన్యం నుంచి పలు రాష్ట్రాలకు గంజాయి స్మగ్లింగ్.. కోట్లలో బిజినెస్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.