ETV Bharat / crime

బ్లాక్​ మార్కెట్​లో రెమ్​డెసివిర్​... ముగ్గురి అరెస్ట్

ఓవైపు కరోనాతో ప్రజలు సతమతమవుతుంటే.. మరోవైపు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కొవిడ్​ బాధితులకు అందించే రెమ్​డెసివిర్​ ఇంజక్షన్‌లు బ్లాక్​మార్కెట్​లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధిక ధరలకు విక్రయిస్తుండగా ముగ్గురిని నార్త్​ జోన్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2.40 లక్షల విలువ చేసే 12 రెమ్​డెసివిర్ ఇంజక్షన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

three persons arrested in hyderabad
రెమ్​డెసివిర్​ బ్లాక్​ మార్కెట్​లో విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్
author img

By

Published : Apr 20, 2021, 5:16 AM IST

కొవిడ్ బాధితులకు ఇచ్చే రెమ్​డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్​ మార్కెట్​లో అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి రూ.2.40 లక్షల విలువచేసే 12 రెమ్​డెసివిర్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. కూకట్​పల్లిలోని హెటిరో హెల్త్ కేర్​లో బిజినెస్ మేనేజర్ బాలాజీనగర్​కు చెందిన షేక్ సలీం జాఫర్(32), ఫీల్డ్ సేల్స్ ఆఫీసర్​ బాతాల వెంకటేష్ (27) కరోనా చికిత్సలో వినియోగించే రెమ్​డెసివిర్ ఇంజక్షన్లకు ఉన్న డిమాండ్​ను సొమ్ము చేసుకునేందుకు ఓ ప్రణాళిక రూపొందించారు.

అల్కెమ్ ఫార్మసీలో మెడికల్ రిప్రజెంటెటీవ్​గా పనిచేస్తున్న రామ్​నగర్​కు చెందిన జొన్నల శరణ్‌తో జత కలిశారు. రూ.2,500 విలువ చేసే ఒక రెమ్​డెసివిర్ ఇంజక్షన్‌ శరణ్​కు రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. వీటిని రూ.20 వేలకు కొవిడ్ బాధితులకు, మెడికల్ షాపులకు అతను సరఫరా చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్​స్పెక్టర్ నాగేశ్వర్‌రావు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. నిందితులు షేక్ సలీం జాఫర్, బాతాల వెంకటేశ్, జొన్నల శరణ్​ను బేగంపేటలో అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కోసం వారిని బేగంపేట పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి: మత రాజకీయాల్లో కాదు అభివృద్ధిలో పోటీ పడండి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.