Fire Accident in Paper Plates Manufacturing Industry: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కేంద్రంలో గల రంగాచారి వీధిలో పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి పరిశ్రమలో మంటలు చెలరేగి.. ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతుల్లో పరిశ్రమ యజమాని భాస్కర్, ఆయన కుమారుడు దిల్లీ బాబు, బాలాజీ అనే మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మూడంతస్థుల భవనంలోని కింది అంతస్తులో పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ నిర్వహిస్తున్నారు. కింది అంతస్థు నుంచి భవనం మొత్తానికి మంటలు వ్యాపించాయి. ఆ మంటల్లో చిక్కుకుని ముగ్గురు మృతి చెందారు. పరిశ్రమ యజమాని భాస్కర్ కుమారుడు దిల్లీ బాబు సాఫ్ట్వేర్ ఇంజినీర్. జన్మదినం రోజే అతను మృతి చెందడంతో బంధువులు తీవ్ర విషాదంలో ఉన్నారు.
ఇవీ చూడండి.. నెల్లూరులో కలకలం.. కేబుల్ వైర్లకు వేలాడుతూ మృతదేహం