ETV Bharat / crime

Accident in Visakhapatnam: విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం.. చిన్నారి సహా తల్లిదండ్రులు మృతి - vizag crime

ఏపీలోని విశాఖలో మధురవాడ జాతీయ రహదారిపై ఘోరప్రమాదం చోటుచేసుకుంది. చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Accident in Visakhapatnam: విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం.. చిన్నారి సహా తల్లిదండ్రులు మృతి

author img

By

Published : Dec 9, 2021, 6:29 PM IST

ACCIDENT IN VISAKHAPATNAM: ఏపీలోని విశాఖలో మధురవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద వేగంగా వస్తున్న లారీ.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతుల్లో చిన్నారి సహా తల్లిదండ్రులు ఉన్నారు. మృతి చెందినవారు పోలిపిల్లి రమణ, లక్ష్మి, శాంతి కుమారిగా గుర్తించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.