ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన ముగ్గురిని మంచిర్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ముఠా సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, జ్ఞానసాగర్, రవికాంత్‌శర్మను అరెస్టు చేశారు. నిరుద్యోగులైన 29 మంది నుంచి రూ.కోటి 61 లక్షల 20 వేలను నిందితులు వసూలు చేసినట్లు గుర్తించారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో నిరుద్యోగులను ఉద్యోగాల పేరిట మోసం చేసి... అమాయకుల నుంచి రూ.లక్షల్లో కాజేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: CM KCR Focus on Drugs Control: పోలీసులు, ఆబ్కారీ అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమావేశం