ETV Bharat / crime

మైనర్ల డ్రైవింగ్‌.. కారు బీభత్సంలో ముగ్గురికి తీవ్రగాయాలు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

CAR ACCIDENT: ఇద్దరు మైనర్ల అతి వేగం ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. రిక్షాలు మరమ్మతు చేస్తున్న వారిపై కారు దూసుకెళ్లడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఏపీ గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది.

three members injured in a car accident at tenali

author img

By

Published : Jul 6, 2022, 2:50 PM IST

CAR ACCIDENT: ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలిలో కారు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్‌ రోడ్డులో కారు అదుపు తప్పి రిక్షా మరమ్మతులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. మైనర్లు కారు నడపడంతోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదంలో ఓ వ్యక్తి కాలు నుజ్జునుజ్జవగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయడపడ్డారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కారు డ్రైవింగ్‌ చేసిన మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కారు బీభత్సం.. ముగ్గురికి తీవ్రగాయాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.