ETV Bharat / crime

తల్లి, కొడుకుతో కలిసి మహిళ ఆత్మహత్య.. కారణం తెలిస్తే తిట్టకుండా ఉండరు..!

కర్ణుని చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. ఓ మనిషి చనిపోవాలనుకుంటే అంత కన్నా ఎక్కువ కారణాలే ఉంటాయనడానికి రోజూ జరుగుతున్న ఘటనలే నిదర్శనం. అయితే.. కష్టాలతో పోరాడలేక కొందరు, వేధింపులు భరించలేక ఇంకొందరు, అనుకున్నది సాధించలేక మరికొందరు.. ఇలా రకరకాల కారణాలతో ప్రాణాలు కోల్పోతుంటే.. ఇక్కడ వీళ్లు మాత్రం ఓ విచిత్రమైన కారణంతో చనిపోవాలనుకున్నారు. ఆ కారణమేంటో మీరూ తెలుసుకోండి..

three members committed suicide and two died and one saved in nizampet

author img

By

Published : May 12, 2022, 6:58 PM IST

ఓ మనిషి చనిపోవటమనేది.. ఎంత కాదన్న బాధాకరమైన విషయం. శత్రువు చనిపోయినా.. మనసులో కొంచెమైనా బాధ కలగకమానదు. "మనిషి బతుకుకు ఎలాగూ విలువలేదు.. కనీసం చావునైనా గౌరవిద్దాం" అని ఓ సినిమాలో డైలాగ్ కూడా ఉంది. కానీ.. ఓ వెర్రి కారణం వారి చావుకు దారి తీసిందని తెలిసినప్పుడు.. బాధపడటం పక్కనబెట్టి సహజంగానే తిట్లదండకం అందుకోవటం సర్వసాధారణం. అయితే.. అచ్చం అలాంటి ఉదంతమే హైదరాబాద్​లోని బాచుపల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది.

నిజాంపేటలోని వినాయక్​నగర్​లోని ఓ అపార్ట్​మెంట్​లో నివసిస్తోన్న లలిత(56)కు ఓ కూతురు, కుమారుడు. అయితే.. లలిత భర్త 12 ఏళ్ల క్రితమే కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. కూతురు దివ్య(36)కు వివాహం చేయగా.. వాళ్ల మధ్య కలహాలతో 12 నెలల నుంచి భార్యభర్తలు విడిగా ఉంటున్నారు. దివ్యకు 18 నెలల బాబు ఉండగా విడిపోయినప్పటి నుంచి.. తల్లి, తమ్ముడితోనే కలిసి ఉంటోంది. ఇంటి భారం మొత్తం కుమారుడు శ్రీకరే​ చూసుకుంటున్నాడు. ఇంట్లో ఉన్న తల్లి, అక్కకు.. అండగా ఏ లోటు తెలియకుండా చూసుకుంటున్నాడు. వాళ్ల కోసం ఇంత చేస్తున్న శ్రీకర్​​కు ఇంకా పెళ్లి కాలేదు. ఇదే వాళ్ల అసలు సమస్య. శ్రీకర్​కు పెళ్లి కావట్లేదని తరచూ బాధపడేవాళ్లు. ఆ బాధతో.. లలిత, దివ్య డిప్రెషన్​లోకి వెళ్లిపోయారు.

ఇద్దరికి డిప్రెషన్​ ఎక్కువైపోవటంతో.. ఈ సమస్యకు చావే పరిష్కారమని నిర్ణయించుకున్నారు. బుధవారం అర్ధరాత్రి 2 గంటలకు చనిపోయేందుకు నిశ్చయించుకున్నారు. తామిద్దరు చనిపోతే.. బాలుడు అనాధ అవుతాడని భావించారు. అందుకోసం వాళ్లు ఆత్మహత్య చేసుకునేందుకు ముందుగానే.. బాలున్ని ఈ లోకం నుంచి దూరం చేయాలనుకున్నారు. చిన్నారికి చున్నితో ఉరివేశారు. ప్రాణం పోయిందని నిర్ధరించుకున్నాక.. తల్లి లలిత ఉరేసుకుంది. ఆ తరువాత.. దివ్య కూడా ఉరేసుకుంది. ఈ క్రమంలో ఉరేసుకున్న చున్నీ తెగిపోవటంతో.. కొన ఊపిరితో దివ్య కిందపడింది.

ఒక్కసారిగా ఉలిక్కిపడిన దివ్య.. భయంతో పక్క గదిలో నిద్రిస్తోన్న తమ్ముడు శ్రీకర్​ను లేపింది. ఈ ఉదంతం మొత్తం వివరించటంతో.. శ్రీకర్​ వెంటనే బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబీకులతో పాటు ఇరుగుపొరుగువారిని విచారించిన పోలీసు.. వీరి మృతికి డిప్రెషన్​నే కారణమని భావిస్తున్నారు.

"భర్తలు వదిలేసినా.. తల్లిని, అక్కను ఏ లోటు రాకుండా కొడుకు/తమ్ముడు.. కుటుంబ పెద్ద పాత్ర పోషిస్తున్నాడు. మరి వాళ్లు కూడా.. పెళ్లి కావట్లేదని.. ఆ అబ్బాయి బాధపడకుండా చూసుకోవాలన్న కనీస ఆలోచన చేయకుండా వీళ్లే డిప్రెషన్​లో పడిపోయారు. సరే.. బాధ ఉంటుంది కదా అనుకుందాం.. మరీ.. అసలే పెళ్లి కాలేదన్న బాధ.. ఉన్న అమ్మ, అక్క కూడా చనిపోతే.. ఆ అబ్బాయి అనాథగా మారి డిప్రెషన్​లో పడిపోతాడనే ఆలోచన కూడా చెయ్యాలిగా..! సరే ఇవన్నీ పక్కన పెడితే.. వీటన్నింటితో ఎలాంటి సంబంధం లేని.. ఆ పసికందును ఎందుకు చంపాలి." అంటూ.. ఈ ఘటన తర్వాత అక్కడున్న స్థానికులు పెదవి విరుస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.