ఏపీలోని విశాఖ జిల్లా మాకవరపాలెం సమీపంలోని పీపీ అగ్రహారం వద్ద ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మాకవరపాలేనికి చెందిన ఆర్ హేమంత్ అనే విద్యార్థి.. తన ఇంట్లో జరిగే శుభకార్యానికి స్నేహితులు అనీష్, హర్షిత్‌తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లాడు.
మార్గమధ్యలో.. పీపీ అగ్రహారం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన బైకు చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో హేమంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. అనీష్, హర్షిత్ తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. మాకవరపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి : గర్భం దాల్చిన పదో తరగతి విద్యార్థిని... స్టేట్ హోమ్‌కు తరలింపు