Tipper Bolta in Hanamkonda Quarry : హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి శివారు గాయత్రి క్వారీలో విషాదం చోటు చేసుకుంది. టిప్పర్ లారీ బోల్తా పడి... ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన చందు, గూడురు మండలం బొద్దుగొండకు చెందిన ముఖేష్, ఝార్ఖండ్‌కు చెందిన అఖీమ్ ఈ ప్రమాదంలో చనిపోయారు. వేగంగా వచ్చిన టిప్పర్ లారీ బోల్తా పడింది. అక్కడ పనిచేస్తున్న ముగ్గురిపై లారీ పడటంతో... ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
కేసు నమోదు
శవ పరీక్షల కోసం మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు, బంధువులు... మార్చురీకి వచ్చి... విగతజీవులైన తమ వారిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మడికొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శోక సంద్రంలో కుటుంబసభ్యులు
ఒకే ప్రమాదం... మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. క్వారీలో జరిగిన ఈ టిప్పర్ ప్రమాదంలో ఒకేసారి ముగ్గురు మృతిచెందడం పట్ల అక్కడ పనిచేసే కార్మికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: Cyber Crime: వ్యాపారి వ్యాలెట్ల హ్యాకింగ్.. సందేశం రాకుండా రూ.2.2 కోట్లు స్వాహా