ETV Bharat / crime

బెల్లాల్​ వద్ద ఆటో బోల్తా.. నలుగురు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు - crime news

నిర్మల్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

author img

By

Published : Jan 19, 2022, 3:10 PM IST

Updated : Jan 19, 2022, 10:24 PM IST

15:08 January 19

నిర్మల్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

నిర్మల్​ జిల్లా కడెం మండలం బెల్లాల్​ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెల్లాల్​ వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కడెం నుంచి బెల్లాల్‌ ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పెద్ద బెల్లాల్‌కు చెందిన సీమల శాంత(55), కన్నపూర్‌ గ్రామానికి చెందిన శంకరవ్వ (52), మల్లన్నపేటకు చెందిన మల్లయ్య (55) అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిర్మల్​ ప్రభుత్వ​ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. మృతదేహాలను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. ఖానాపూర్‌ సీఐ అజయ్‌ బాబు, కడెం ఎస్సై రాజు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

Last Updated : Jan 19, 2022, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.