కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. నాలుగేళ్ల చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలొదిలారు. పిట్లంకు చెందిన యువకులు దీపావళిని పురస్కరించుకుని టపాసులు కొనుక్కునేందుకు కామారెడ్డికి వెళ్లారు. టపాసులు కొనుక్కుని ఆనందంగా స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. మర్గ మధ్యలోకి రాగానే.. వర్షం ప్రారంభమైంది. వైపర్ వేసినపుడు.. రోడ్డు సరిగా కనిపించక... తాడ్వాయి మండలం ఎర్రపహడు వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది.
ప్రమాదం జరిగినప్పుడు చూసిన ఇతర వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీశారు. అప్పటికే ముగ్గురు యువకులు ప్రాణాలు వదలగా.. తీవ్రగాయాల పాలైన నాలుగేళ్ల సుశాంక్‌ను అంబులెన్స్‌లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్రగాయమై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారులో ఇరుక్కుపోయిన మిగతా వారిని అతికష్టం మీద బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో కారులో నాలుగేళ్ల బాలునితో కలుపుకుని మొత్తం ఏడుగురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి కుటుంబానికి సమాచారం అందించారు.
ఇదీ చూడండి: