ETV Bharat / crime

ఓ ఇంట్లో విందు... మూడు కుటుంబాల్లో విషాదం - తెలంగాణ నేర వార్తలు

వారంతా దగ్గరి బంధువులు. పది రోజుల క్రితం ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. పెద్దకర్మకు సమీప బంధువులు వచ్చారు. ఉదయం విందుకు రాలేని వారికి సాయంత్రం భోజనాలు పెట్టారు. అదే వారికి శాపమైంది. భోజనం చేసిన వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శనివారం రాత్రి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో జరిగింది.

VINDU
VINDU
author img

By

Published : Aug 15, 2021, 4:38 AM IST

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన విందు.. మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. చంద్రతండాకు చెందిన బోడ భిక్షం కుమారుడు బోడ అర్జున్ పది రోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూశాడు. కుటుంబ సభ్యులు శనివారం పెద్ద కర్మ నిర్వహించారు. బంధువులు, తండావాసులకు మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. దాదాపు 150 మంది భోజనాలు చేశారు. అయితే సమీప బంధువులైన బోడ హరిదాసు, బోడ మల్సూరు బోడ భద్రుతోపాటు మరో నలుగురు.... వ్యవసాయ పనులకు వెళ్లటం వల్ల మధ్యహ్నం విందుకు హాజరుకాలేదు.

సాయంత్రం విందుకు వెళ్లిన వారికి మద్యం ఏర్పాటు చేశారు. మద్యం తాగిన వారిలో ముగ్గురు కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు ముగ్గురు ప్రాణాలు విడిచారు. విందుకు వెళ్లిన వాళ్లు విగతజీవులుగా మారేసరికి కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఏడుగురు తింటే.. మగ్గురు మృతి

బోడ హరిదాసు, బోడ భద్రు మార్గమద్యంలో మృత్యువాతపడగా... మల్సూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇదే ఘటనలోమరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు ఎవరు చనిపోయారో.. ఎవరి బతికి ఉన్నారో చాలా సమయం వరకు తెలియక బాధిత కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. విందుకు మొత్తం ఏడుగురు వెళ్లగా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విందు భోజనాలు ఏర్పాటు చేసిన బోడ భిక్షం కుటుంబీకులు... శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. విషప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టు మార్టం నివేదిక వస్తే పూర్తి విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: బాలుడి మృతదేహంతో కుటుంబసభ్యుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.