కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోన్న భవాని లాడ్జిపై పోలీసులు దాడి చేశారు. నిర్వాహకుడితోపాటు ఇద్దరు విటులు, పలువురు బాధిత మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
బాధిత యువతులను స్థానిక సఖీ సెంటర్కు తరలించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: బీమా సొమ్ము కోసం 'చావు తెలివి తేటలు'