తమ ప్రమేయం లేకుండా ఖాతాదారుల బ్యాంకు అకౌంట్ల నుంచి రూ. లక్షల్లో డబ్బులు మాయమైన రెండు ఘటనలు నగరంలో చోటు చేసుకున్నాయి. కొవిడ్‌తో మరణించిన తన భర్త ఖాతా నుంచి రూ.35 లక్షలు మాయమయ్యాయని ముషీరాబాద్‌కి చెందిన ఓ మహిళ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీతాఫల్‌మండీకి చెందిన మల్లికార్జున్ అనే మరో వ్యక్తి ఖాతా నుంచి రూ.6.5 లక్షలు మాయమైనట్లు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి : TSRTC: ‘ఆమె’ చెయ్యెత్తితే బస్సు ఆగాల్సిందే...!