Thief Fell Into Well After Stealing: హనుమకొండ జిల్లాలోని ఓ దొంగ చోరీ చేసి.. పారిపోతూ బావిలో పడ్డాడు. హసన్ పర్తి మండలం ఆనంతసాగర్లోని ఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలోని బాలికల వసతి గృహంలో ఓ దొంగ చోరీకి పాల్పడ్డాడు. వసతి గృహంలోని సెల్ ఫోనులు, ల్యాప్‌టాప్‌ను దొంగలించి పారిపోతుండగా... పక్కనే ఉన్న బావిలో పడిపోయాడు. రాత్రి సమయం కావడంతో అందులో నుంచి బయటపడే దారి కనిపించక పోవడంతో బావిలోనే ఉండిపోయాడు.
ఉదయం అవ్వగానే దొంగ పెద్ద కేకలు, అరుపులు చేస్తూ ఉన్నాడు. అటువైపు వెళుతున్న స్థానికులు ఆ అరుపులను విని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బావి వద్దకు చేరుకున్న పోలీసులు.. అతనిని బయటకు తీశారు. ఆ దొంగను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదే విధంగా కళాశాలలో పలుమార్లు దొంగతనం జరిగినా యజమాన్యం పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు భద్రత కల్పించాలంటూ కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. మూడు రోజుల వ్యవధిలో 14 ఫోన్స్ అపహరణకు గురయ్యాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: