ETV Bharat / crime

తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా.. దొంగతనాలు - హైదరాబాద్ తాజా దొంగతనాలు

లాక్​డౌన్ కారణంగా సొంత గ్రామాలకు వెళ్లిన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు యత్నించారు ముగ్గురు వ్యక్తులు. ఓ ఇంట్లో సెల్​ఫోన్ చోరీ చేయగా.. మరో రెండిళ్లలో ఏం దొరక్క వెనుదిరిగి వెళ్లిపోయారు.

thefts targeted locked houses in hyderabad
తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా.. దొంగతనాలు
author img

By

Published : May 23, 2021, 3:24 PM IST

హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసి నగర్​లో శుక్రవారం తెల్లవారుజామున దొంగలు హల్​చల్​ చేశారు. ఉదయం మూడు గంటల ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. లాక్​డౌన్ కారణంగా మూడు ఇళ్ల యజమానులు తాళాలు వేసి తమ స్వగ్రామాలకు వెళ్లారు. ఈ మూడు ఇళ్ల తాళాలు పగులగొట్టిన చోరులు.. ఓ ఇంట్లో సెల్​ ఫోన్​ను దొంగిలించారు. మరో రెండిళ్లలో ఏం దొరక్కపోవడం వల్ల వెనుదిరిగి వెళ్లిపోయారు.

ఈ రోజు ఉదయం ఇంటికి వచ్చిన యజమానికి తాళం పగులగొట్టి ఉండటం కనపడింది. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూసేసరికి సెల్​పోన్ కనిపించలేదు. దొంగతనం జరిగిందని గ్రహించిన యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు కాలనీలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. వీటి ఆధారంగా దొంగతనానికి పాల్పడింది ముగ్గురు వ్యక్తులని తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చదవండి : మాంసం దుకాణాల వద్ద బారులుతీరిన జనం.. కనిపించని భౌతికదూరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.