ETV Bharat / crime

ఎరువుల దుకాణంలో అర్ధరాత్రి దొంగతనం - heft at a fertilizer shop in Narsimhaulpet

మహబూబాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఎరువుల దుకాణంలోని రూ.5 లక్షల విత్తనాలతో పాటు.. రూ.1.30 వేల నగదు కాజేశారు. మరో ఇంట్లోకి చొరబడిని బంగారం, నగదు ఎత్తుకెళ్లారు.

Theft at a fertilizer shop in Narsimhaulpet zone of Mahabubabad district
ఎరువుల దుకాణంలో అర్ధరాత్రి దొంగతనం
author img

By

Published : Jun 12, 2021, 12:37 PM IST

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజీ వద్ద ఉన్న నవ్యశ్రీ ఎరువులు, విత్తనాల దుకాణంలో రాత్రి చోరీ జరిగింది. దొంగలు దుకాణం వెనక తలుపులను గడ్డపార, గొడ్డలితో తొలిగించి ఇంట్లోకి ప్రవేశించారు. దుకాణంలోని రూ.5 లక్షల పత్తి, మిరప విత్తనాలతో పాటు రూ.1.30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.

అనంతరం పక్కనే ఉన్న మరో ఇంట్లో చొరబడిన దొంగలు... రెండున్నర తులాల బంగారు గొలుసు, రూ.30 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. సంఘటన స్థలాలను డీఎస్పీ వెంకటరమణ, ఎస్సై నరేష్‌ పరిశీలించారు. క్లూస్‌ టీం వేలి ముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: తాటి చెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.