ETV Bharat / crime

Arrest:పేకాటరాయుళ్లపై పోలీసుల కొరడా.. నిందితుల్లో మంత్రి తమ్ముడు

పేకాట ఆడుతూ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి తమ్ముడు నర్సింహారెడ్డి టాస్క్​ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. నర్సింహారెడ్డితో పాటు మరో 12 మందిని అరెస్టు చేసిన టాస్క్​ఫోర్స్ సిబ్బంది.. బోయిన్​పల్లి పోలీసులకు అప్పగించారు.

poker. poker players arrest, minister's brother arrest
పేకాట, పేకాటాడుతూ మంత్రి పట్టుబడ్డ మంత్రి తమ్ముడు, మంత్రి మల్లారెడ్డి
author img

By

Published : Jun 17, 2021, 8:46 AM IST

పేకాట ఆడుతూ ఉత్తర మండలం టాస్క్​ఫోర్స్ పోలీసులకు రాష్ట్ర మంత్రి తమ్ముడు దొరికిపోయాడు. న్యూ బోయిన్​పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్​ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పలువురు పేకాట ఆడుతున్నట్లు టాస్క్​ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు టాస్క్​ఫోర్స్ ఇన్​స్పెక్టర్ నాగేశ్వర్​రావు నేతృత్వంలో పోలీసుల బృందం దాడులు చేసింది. ఇందులో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి తమ్ముడు చామకూర నర్సింహారెడ్డితో పాటు మరో 12మంది దొరికారు. వారిని బోయిన్​పల్లి పోలీసులకు టాస్క్​ఫోర్స్ బృందం అప్పగించింది.

ప్రధాన నిందితుడైన నర్సింహారెడ్డితో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కౌడి సాయిలు(44), బి.నర్సింహారావు(65), ఎస్​.హనుమంతు(58), బి.సుదర్శన్ రెడ్డి(64), కె.మోహన్ రెడ్డి(49), వి.భాస్కర్ రెడ్డి(49), కె.గోవర్ధన్ రెడ్డి(42), బి.జనార్దన్ రెడ్డి(42), పి.శ్రీనివాసరాజు(57), ఈ.వెంగల్ రెడ్డి(43), కే. నర్సిరెడ్డి(64), బత్తిని కృష్ణ(40)లపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి రూ.1,40,740ల నగదు, 13 సెల్​ఫోన్లు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని బెయిల్​పై విడుదల చేసినట్లు ఇన్​స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.