ETV Bharat / crime

బాలుడిని దారుణంగా హత్య చేసిన యువకులు

తొమ్మిదో తరగతి బాలుడిని పాఠశాలలోనే కత్తితో పొడిచి(Stabbing) హత్య చేశారు ఇద్దరు యువకులు. అనంతరం ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

murder
murder
author img

By

Published : Aug 25, 2021, 3:26 PM IST

తొమ్మిదో తరగతి విద్యార్థిని పాఠశాలలోనే కత్తితో పొడిచి(Stabbing) హత్య చేశారు ఇద్దరు యువకులు. ఈ దారుణ ఘటన ఛత్తీస్​గఢ్​లోని రాయ్​గఢ్​లో జరిగింది.

ఇదీ జరిగింది..

రామభాఠా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సాగర్ టండన్​ అనే విద్యార్థి మధ్యాహ్నం భోజన విరామంలో తోటి విద్యార్థులతో కలిసి ఆటలు ఆడుతున్నాడు. ఆ సమయంలోనే ఇద్దరు యువకులు సాగర్​ వద్దకు వచ్చి తీవ్రంగా కొట్టారు. కత్తితో పొడిచి ఘటనా స్థలం నుంచి పరారయ్యారు.

భయాబ్రాంతులైన తోటి విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. సాగర్​ను వెంటనే సమీపంలోని కమ్యూనిటీ సెంటర్​కు తరలించారు స్కూలు టీచర్లు. పాఠశాల యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

ఓ నిందితుడిని తానుల్​గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. మరో వ్యక్తి ఎవరో తెలియాల్సి ఉందని స్పష్టం చేశారు. హత్యకు కారణం ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Accident : వధువును తీసుకెళ్తుండగా ప్రమాదం... నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.