కృష్ణానదిలో పడి మనోహర్ అనే యువకుడు గల్లంతైన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో జరిగింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు గాలింపు చేపట్టిన అతని ఆచూకీ లభ్యం కాలేదు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామానికి చెందిన మనోహర్ (20) కొత్త వలలను కోన్నాడు. ఈ సందర్భంగా మొక్కుతీర్చుకోవడానికి మరో ముగ్గురు మత్స్య కారులతో కలిసి కృష్ణా నది అవతల ఒడ్డున ఉన్న ఆలయానికి మరబోటులో వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు నదిలో పడిపోయారు. గమనించిన తోటి జాలర్లు ఒకరిని కాపాడగా మనోహర్ గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు గాలింపు చేపట్టిన అతని ఆచూకీ లభ్యం కాలేదు. రాత్రి కావడంతో వారు తిరిగి ఒడ్డుకు చేరుకున్నారు. యువకుడు గల్లంతు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఇదీ చదవండి: 'దొంగతనం చేస్తారు... ఇంటి యజమానినే మీరెవరని ప్రశ్నిస్తారు'